కరోనా విజృంభించే అవకాశం-WHO
- June 09, 2020
జెనీవా:కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పుడప్పుడే వదిలి పెట్టేటట్లు కనిపించడం లేదు. కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇదే విషయమై హెచ్చరిస్తోంది. వైరస్ ఐరోపా దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా దక్షిణాసియా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం నమోదైన వివరాలను బట్టి 10 దేశాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 9 రోజుల్లో లక్షకు పైగా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఆదివారం అత్యధికంగా 1,36,000 కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
ఆఫ్రికా దేశాల్లో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోందని టెడ్రోస్ పేర్కొన్నారు. చాలా దేశాల్లో కేసులు వెయ్యికి తక్కువగానే నమోదవుతున్నప్పటికీ.. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని తెలిపారు. అయితే కొన్ని దేశాల్లో వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే అంశం అని అన్నారు. కానీ వైరస్ నిర్మూలను నిబంధనలను గాలికి వదిలేస్తే మళ్లీ విజృంభించే అవకాశాలు లేకపోలేదన్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







