వాట్సాప్ లో ఐదు కొత్త ఫీచర్స్
- June 09, 2020
వాట్సాప్ మరిన్ని ఫీచర్స్ అందుబాటులోకి తెస్తోంది.. మొబైల్ యాప్‌లో మరో ఐదు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే డార్క్ మోడ్ ఫీచర్‌ను లాంచ్ చేసిన వాట్సాప్... త్వరలో గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ పరిమితిని 8కి పెంచింది. ఇంత వరకూ నలుగురికి మించి గ్రూప్ కాల్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. అలాగే, మల్టిపుల్ డివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది వాట్సాప్. అలాగే, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కొత్త కాంటాక్ట్స్‌ను జోడించుకునే అవకాశం ఉంది. అదే విధంగా 24 గంటల్లో స్టోరీలు, స్టేటస్లు అదృశ్యమయ్యేలా సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజెస్ ఫీచర్‌ను త్వరలో అందించనుంది. ఇన్ యాప్ బ్రౌజర్ ఫీచర్‌పైనా వాట్సాప్ కసరత్తు చేస్తోంది. లాస్ట్ సీన్ ఆప్షన్ కేవలం ఫ్రెండ్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండే ఫీచర్‌ను జోడించబోతోంది వాట్సాప్. ఇలా కొత్త ఫీచర్స్‌తో తన యూజర్లను ఆక్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది వాట్సాప్.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







