స్కూళ్లలో సిలబస్ తగ్గించేందుకు కేంద్రం యోచన..సూచనలు అందించమంటున్న మంత్రి

- June 09, 2020 , by Maagulf
స్కూళ్లలో సిలబస్ తగ్గించేందుకు కేంద్రం యోచన..సూచనలు అందించమంటున్న మంత్రి

న్యూఢిల్లీ: పాఠశాలల్లో సిలబస్, నిర్ణీత గంటలను తగ్గించేందుకు కేంద్రం ఆలోచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అమలు చేసే ఆలోచన ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిషాంక్ తెలిపారు. 'ప్రస్తుత పరిస్థితులు, తల్లిదండ్రుల అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుని రాబోయే ఆర్థిక సంవత్సరంలో సిలబస్, పాఠశాల పనిగంటలను తక్కించే అవకాశాలను పరిశీలిస్తున్నాం' అని పోక్రియాల్ ఒక ట్వీట్‌లో తెలిపారు. దీనిపై టీచర్లు, విద్యావేత్తలు తమ సూచనలు, సలహాలను సోషల్ మీడియాలో #SyllabusForStudents2020 ట్యాగ్‌తో తెలియజేయాలని కూడా మంత్రి కోరారు.

కోవిడ్‌పై పోరాటంలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో అన్ని విద్యాసంస్థల ఎకడమిక్ షెడ్యూల్‌ పట్టాలు తప్పింది. రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు పెరగుతుండటంతో మార్చి 16 నుంచి విద్యాసంస్థల మూసివేతకు ప్రధాని మోదీ ఆదేశించారు. అనంతరం మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. విద్యావిషయిక షెడ్యూల్‌లో తలెత్తిన అవాంతరాలను అధిగమించేందుకు రాష్ట్రాలు ఇప్పటికీ కసరత్తు చేస్తూనే ఉన్నాయి. పరీక్షలు నిర్వహించకుండానే స్కూలు, కాలేజీ విద్యార్థులను పాస్ చేస్తూ పలు రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకున్నాయి. అకడమిక్ క్యాలెండర్‌కు అనుగుణంగా కొన్ని యూనివర్శిటీలు ఆన్‌లైన్ క్లాసులు, పరీక్షలు నిర్విహిస్తున్నాయి. లాక్‌డౌన్‌ ప్రభావం అకడమిక్ షెడ్యూల్‌పై పడటం, విద్యా సంస్థలు ఇప్పటికీ తెరుచుకోకపోవంతో పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు సిలబస్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com