రెన్యువల్ ఫీజు నుంచి హజ్ మరియు ఉమ్రా సంబంధిత వ్యాపారాలకు ఉపశమనం
- June 09, 2020
యూఏఈ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో నేషనల్ సెక్టార్‌కి సంబంధించిన పలు అంశాలపై ‘మద్దతు’ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. హజ్ మరియు ఉమ్రా సంబంధిత వ్యాపారాలకు లైసెన్సు రెన్యువల్ ఫీజు నుంచి ఉపశమనం కల్పిస్తూ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు ఫీజు నుండి ఉపశమనం కల్పించనున్నారు. హజ్ మరియు ఉమ్రా ఆపరేటర్స్‌పై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే ఈ చర్యలు చేపట్టారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ - ఫెడరల్ ట్యాక్స్ అథారిటీని రీ-స్ట్రక్చర్ చేయాలని కూడా క్యాబినెట్ తీర్మానించింది. దుబాయ్ డిప్యూటీ రూలర్ అలాగే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ షేక్ హమదాన్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. ఇంకా పలు కీలక నిర్ణయాల్ని ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు