కరోనా ఎఫెక్ట్: మరింతమంది ఉద్యోగులకు లే-ఆఫ్ ప్రకటించిన ఎమిరేట్స్
- June 10, 2020
దుబాయ్:ప్రపంచంలోనే అతి పెద్ద లాంగ్ హాల్ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్, మరింత మంది ఉద్యోగులకు లే-ఆఫ్ ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ లే-ఆఫ్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే విధిలేని పరిస్థితుల్లో లే-ఆఫ్ ప్రకటిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఎమిరేట్స్ సంస్థ 60,000 మందికి పైగా ఉద్యోగుల్ని కలిగి వుంది. మే 31న ఓసారి ఎమిరేట్స్ ఉద్యోగుల లే-ఆఫ్‌ని ప్రకటించిన విషయం విదితమే. కాగా, గ్లోబల్ ఎయిర్‌లైన్స్ 84.3 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఈ ఏడాది చవిచూడటం జరిగింది. ఏవియేషన్ రంగంలోనే అతి పెద్ద నష్టంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఈ పరిస్థితిని ఎలా అభివర్ణించాలో అర్థం కావడంలేదని పౌర విమానయాన రంగ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?