రేపటి నుంచి అందరికీ శ్రీవారి దర్శనం
- June 10, 2020
తిరుమల:రేపటి నుంచి అందరికీ తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. దీంతో భక్తజనం.. దర్శన టోకెన్ల కోసం బారులు తీరారు. తిరుమలలో మొత్తం 3 ప్రాంతాల్లో టోకెన్లు అందిస్తున్నారు. విష్ణునివాసం వద్ద ఏకంగా 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్ కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో ఇప్పటికే 3వేల టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు భక్తులు. రోజుకు 6 నుంచి 7 వేల మందికి దర్శనం ఏర్పాట్లు చేశారు. క్యూ కాంప్లెక్స్‌లోకి గంటకు 500 మందినే అనుమతిస్తారు. ఉదయం ఆరున్నర నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకే దర్శనం ఉంటుంది. శ్రీవారి మూలమూర్తి దర్శనానికే అనుమతిస్తారు. వకుళమాత, యోగ నరసింహస్వామి ఆలయాలకు అనుమతించరు. అలాగే ఆర్జిత సేవలకూ అనుమతి లేదు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు