120 బహ్రెయినీ దినార్స్ దొంగతనం: నిందితుడికి ఐదేళ్ళ జైలు
- June 10, 2020
మనామా:ఓ వ్యక్తి, తన రూమ్ మేట్ ATM కార్డుని దొంగిలించి, అందులోని 120 బహ్రెయినీ దినార్స్ సొమ్ముని ‘డ్రా’ చేసుకున్నందుకుగాను, ఐదేళ్ళ జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. కేసు వివరాల్లోకి వెళితే, ఓ ల్యాబర్ క్యాంప్‌లో నిందితుడు, తన రూవ్‌ు మేట్‌కి చెందిన పర్స్‌లోని ఏటీఎం కార్డుని దొంగిలించాడు. మరోపక్క, బాధిత వ్యక్తి మొబైల్ ఫోన్‌కి, సొమ్ము డ్రా చేయడంపై ఎస్‌ఎంఎస్ రావడంతో, తన కార్డు కోల్పోయిన సంగతి తెలిసింది. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు బాధితుడు. అల్ హిద్ పోలీసులు విచారణ జరిపి, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. 75 బహ్రెయినీ దినార్స్ వెచ్చించి గ్రోసరీస్ కొనుగోలు చేసినట్లు, 45 బహ్రెయినీ దినార్స్ వెచ్చించి మొబైల్ క్రెడిట్ కార్డ్స్ కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపాడు. నిందితుడ్ని జైలు శిక్ష అనంతరం డిపోర్ట్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు