ఒమన్:ఇవాళ్టి నుంచి దోఫర్ గవర్నరేట్ పరిధిలో చెక్ పాయింట్స్ ఏర్పాటు
- June 13, 2020
మస్కట్:కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్లీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది ఒమన్ ప్రభుత్వం. అనవసర ప్రయాణాలను తగ్గించేందుకు ఎక్కడిక్కడ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా దోఫర్ గవర్నరేట్ పరిధిలో ఇవాళ్టి నుంచి తనఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు. కరోనా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దోఫర్ పరిధిలోని మసిర, జబల్ అల్ అక్ధర్, జబల్ షామ్స్ ప్రాంతాల్లో చెక్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని, పౌరులు, ప్రవాసీయులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపింది. ఈ రోజుల మధ్యాహ్నం 12 గంటల నుంచి వచ్చే నెల 3వ తేది వరకు తనఖీ కేంద్రాలు కొనసాగుతాయని కూడా వెల్లడించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







