బహ్రెయిన్:దాడి చేసి దోపిడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- June 13, 2020
మనామా:అసియాకు చెందిన ఓ వ్యక్తిపై దౌర్జన్యంగా దాడి చేసి అతని వస్తువులను దొంగిలించిన ఇద్దరు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిలో ఒకరి వయసు 46 ఏళ్లు, మరొకరు 30 ఏళ్లు ఉంటారని వివరించారు. ఈ ఘటన బహ్రెయిన్ లోని ఇసా పట్టణంలో చోటు చేసుకుంది. దాడికి చేసి దోపిడికి పాల్పడిన వీడియో వైరల్ గా మారిన కొద్ది గంటల్లోనే దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. అయితే..ఇద్దరి దోపిడి, దాడి కేసులను నమోదు చేశామని, ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నారని నేరానికి సంబంధించి ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియో ప్రకారం 29 ఏళ్ల అసియా దేశాలకు చెందిన వ్యక్తిని అడ్డుకున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు దాడి చేసి అతని దగ్గరున్న వస్తువులను లాక్కున్నాడు. మరో వ్యక్తి అటు వెళ్తున్న వారెవరు అతనికి సాయంగా రాకుండా బెదిరిస్తూ అడ్డుకున్నట్లు స్పష్టం అవుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..