ఈద్ అల్ అధా తేదిలను ప్రకటించనున్న ఖగోళ నిపుణులు

- June 14, 2020 , by Maagulf
ఈద్ అల్ అధా తేదిలను ప్రకటించనున్న ఖగోళ నిపుణులు

ఈ ఏడాదిలో ఈద్ అల్ అధా జులై 31న వస్తుందని తమ అంచనాగా చెబుతున్నారు అరబ్ యూనియన్ ఖగోళ, అంతరిక్ష శాస్త్ర సభ్యుడు ఇబ్రహీం అల్ జర్వన్. ఇక జుల్ హిజ్జ 1441 నెలకు సంబంధించి నెలవంక ఈ నెల 20న సోమవారం రాత్రి 9.33 నిమిషాలకు కనిపిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ఈ ఏడాది వేసవి కాలం జూన్ 21న అర్ధరాత్రి 1.44 గంటల నుంచి ప్రారంభం అవుతుందని..సెప్టెంబర్ 23 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ వేసవిలో సగటు ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్య నమోదవుతాయని కూడా అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ ఎండాకాలంలో వర్షాలకు కురియటం అరుదైన విషయంగానే ఇబ్రహీం వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com