ఓటీటీలో కేజీఎఫ్ 2..!
- June 14, 2020
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. కన్నడం,హిందీ, తెలుగు, తమిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంఛైజీలో సీక్వెల్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్లకు బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. దీంతో చిన్న, పెద్ద అన్ని సినిమాల విడుదల తేదీలు వాయిదా పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ 2కు సంబంధించి ఆసక్తికరవార్త టీ టౌన్లో చక్కర్లుకొడుతోంది.
కేజీఎఫ్ 2 ఓటీటీ ఫ్లాట్ ఫామ్లో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా వాటిని ఖండించారు హీరో యష్. కేజీఎఫ్ 2 ను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదు. బిగ్స్క్రీన్పై ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నాం అన్నారు. మొదటి పార్ట్కంటే రెండో పార్ట్ ఇంకా ప్రతిష్ఠాత్మకంగా ఉండాలని, అలరించాలని అభిమానులు అనుకుంటున్నారు వారిని నిరాశకు గురిచేయబోమని వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







