కరోనా పై సర్వే చెప్తున్న షాకింగ్ విషయాలు
- June 14, 2020
కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. కరోనా వైరస్ ను తట్టుకొని నిలబడాలి అంటే తప్పనిసరిగా వ్యాధినిరోధక శక్తి కలిగి ఉండాలి. కరోనా వైరస్ దేశంలోని 82 జిల్లాల్లో వ్యాపించింది. ఈ 82 జిల్లాల్లో ఐసీఏంఆర్ ఓ సర్వేను నిర్వహించగా అందులో అనేక విషయాలు బయటపడ్డాయి. 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉన్నారని ఐసీఏంఆర్ సర్వేలో తేలింది.
ఇక ఇదిలా ఉంటే ప్రతిరోజు దేశంలో 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో కేసుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు ప్రజలను మోటివేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, చేతులను ప్రతి గంటకు ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలని ప్రభుత్వం చెప్తున్నది. దేశంలో అందరికంటే వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న రాష్ట్రం జమ్ము కాశ్మీర్ అని ఐసీఏంఆర్ సర్వేలో తేలింది. ఆ రాష్ట్రంలోని 98 శాతం మంది ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉందని ఐసీఏంఆర్ సర్వేలో తేలింది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో 2 శాతం మందికి మాత్రమే యాంటీబాడిలు ఉన్నాయని సర్వేలో తేలింది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







