ప్రభాస్ తో థర్డ్ వరల్డ్ వార్ కు సిద్దమైన నాగ్ అశ్విన్
- June 14, 2020
మహానటి సినిమాతో డైరక్టర్ నాగ్ అశ్విన్ కేపాసిటీ ఏంటో ఇండస్డ్రీకి క్లారిటీ వచ్చేసింది. అలాంటి సినిమా అందించాక కూడా అన్నాళ్లపాటు ఖాళీగా కూర్చుని, ఓ భారీ సినిమా స్క్రిప్ట్ తయారుచేసారు అంటే కచ్చితంగా ఏదో వుండే వుంటుంది అన్న ఆసక్తి పెరిగింది. ప్రభాస్ వన్ సిటింగ్ లో ఓకె చేసాడు అనగానే ఈ ఆసక్తి మరింత డబుల్ అయింది. అప్పటి నుంచీ ఈ కథలో విశేషాల మీద గ్యాసిప్ లు వినిపిస్తూనే వస్తున్నాయి.
సైన్స్ టచ్ వుంటుందని, కనిపించని అతీతశక్తి ప్రస్తావన వుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. లేటేస్ట్ సంగతి ఏమిటంటే, ఈ సినిమాలో థర్డ్ వరల్డ్ వార్ అన్నది కూడా ఓ కీ పాయింట్ గా వుంటుందన్నది. ఈ థర్డ్ వరల్డ్ వార్ సీన్ కోసం ఓ భారీ సెట్ ను కూడా హైదరాబాద్ లోనే రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ థర్డ్ వరల్డ్ వార్ కాన్సెప్ట్ వుండడంతో, సినిమాకు దాదాపు 400 కోట్ల మేరకు బడ్జెట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత అశ్వనీదత్.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







