స్వదేశానికి తిరిగి వస్తున్న ప్రవాసీయుల వివరాలను సేకరిస్తున్న కేంద్రం

- June 15, 2020 , by Maagulf
స్వదేశానికి తిరిగి వస్తున్న ప్రవాసీయుల వివరాలను సేకరిస్తున్న కేంద్రం

వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తిరిగి వస్తున్న నైపుణ్యం గల వలసదారులపై భారతదేశం డేటాను సేకరిస్తోందని, వారి నైపుణ్యాలను జాతీయ అభివృద్ధికి ఉపయోగించుకునే మార్గాలను పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. మంత్రిత్వ శాఖ నిర్వహించిన వలసదారుల రక్షకుల వార్షిక సమావేశంలో మాట్లాడుతూ "చాలా సంవత్సరాలుగా విదేశాలలో నివసించిన అధునాతన నైపుణ్యం గల ఎందరో వలసదారులు కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయి స్వదేశాలకు తిరిగి వస్తున్నారు. వీరు తమ నైపుణ్యంతో భారతదేశ అభివృద్ధికి దోహదపడతారు. కాబట్టి 'వందే భారత్ మిషన్' ద్వారా ఈ డేటా ను సేకరించి అధ్యయనం చేయడంలో నిమగ్నమై ఉన్నాము" అని జైశంకర్ చెప్పారు. 

కార్మికుల డేటాబేస్ అభివృద్ధి..
"ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయటం అత్యవసరం. రాబోయే నెలలు ఆ దిశగా అంకితభావంతో కూడిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ లక్ష్యాన్ని సులభతరం చేయడానికి Protector of Emigrants (POEs) (వలసదారుల రక్షకులు) అందించే సహకారం చాలా ముఖ్యమైనది. ఉపాధి మద్దతు కోసం నైపుణ్యం కలిగిన కార్మికుల రాక డేటాబేస్ అయిన SWADES (Skilled Workers Arrival Database for Employment Support) ను అభివృద్ధి చేయడానికి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డిసి) కు డేటా ప్రవాహాన్ని విదేశాంగ శాఖ సులభతరం చేసిందని ఆయన అన్నారు. ఇ-మైగ్రేట్‌తో కలిసి సాగిస్తున్న ఈ ప్రయత్నంతో కార్మికుల నైపుణ్యానికి తగ్గ ఉద్యోగం ఎన్నుకునేందుకు వీలవుతుంది" అని జైశంకర్ అన్నారు.

ఏజెంట్ల చేతిలో మోసపోతున్న గల్ఫ్ కార్మికులకు అండగా..
గల్ఫ్ ప్రాంతంలో పనిచేసే భారతీయులకు ముఖ్యంగా బ్లూ కాలర్ కార్మికులు మరియు మహిళా వలసదారుల ప్రయోజనాలకు తన ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిందని, విదేశీ యజమానుల మరియు నకిలీ ఏజెంట్ల ద్వారా మోసపోయిన వారికి అండగా ఉంటామని, మంత్రిత్వ శాఖ నమోదు చేసిన ఏజెంట్ల నియామకం లో గణనీయమైన మార్పులు జరిగాయి అని విదేశాంగ మంత్రి తన ముఖ్య ఉపన్యాసంలో తెలిపారు.

ఆన్‌లైన్ ఫారం..గల్ఫ్ నుండి అధికంగా..
తిరిగి వచ్చే పౌరులకు అవసరమైన వివరాలను సేకరించడానికి www.nsdcindia.org/swades లో ఆన్‌లైన్ ఫారం పొందుపరచటం జరిగింది. ఈ ఫారమ్‌లో కార్మికులు తమ పని రంగం, ఉద్యోగ శీర్షిక, ఉపాధి మరియు సంవత్సరాల అనుభవానికి సంబంధించిన వివరాలు నింపాలి. ఫారమ్ నింపడంలో ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే పౌరులకు మద్దతు ఇవ్వడానికి టోల్ ఫ్రీ కాల్ సెంటర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడింది. ఈ లింక్ మే 30 న లాంచ్ చేయగా, జూన్ 3 వరకు 7,000 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు సేకరించిన డేటా ప్రకారం యూఏఈ, ఒమాన్, ఖతార్, కువైట్ మరియు సౌదీ అరేబియా నుండి అత్యధికంగా పౌరులు భారతదేశానికి తిరిగి వస్తున్నారు. వీరిలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తెలంగాణ చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. స్కిల్ మ్యాపింగ్ ప్రకారం, వీరందరూ ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, నిర్మాణం, పర్యాటక మరియు ఆతిథ్యం, ఆటోమోటివ్ మరియు ఏవియేషన్ వంటి రంగాలలో పనిచేస్తున్నారు అని డేటా ను వివరించిన జైశంకర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com