జూలై 3 న 'భానుమతి రామకృష్ణ' వరల్డ్ ప్రీమియర్
- June 15, 2020
ఇటీవల వచ్చిన 'భానుమతి రామకృష్ణ' ట్రైలర్ చలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తగా కనిపిస్తున్న ఈ రొమాన్స్ డ్రామా, జూలై 3 న ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమైంది.
భిన్న మనస్తత్వాలు కలిగి, ముప్పయేళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు, ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో వస్తున్న ఇందులో, భానుమతిగా సలోని లూథ్రా , రామకృష్ణగా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. వైవిధ్యమైన కథనంతో సాగే శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు చూపించిన అద్భుతమైన విజువల్స్, శ్రవణ్ భరద్వాజ్ సమకూర్చిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్ అవుతుంది. అచ్చు రాజమణి నేపథ్య సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ,ప్రముఖ యువ దర్శకుడు రవికాంత్ పెరెపు ఎడిట్ చేశారు.
ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత అల్లు అరవింద్ 'భానుమతి రామకృష్ణ' పోస్టర్ను విడుదల చేసి మాట్లాడుతూ - "చాలా కాలం తరువాత ఒక అందమైన ప్రేమకథను చూస్తున్నట్లు అనిపించింది. 30 ఏళ్ళ వయసులో ఉన్న పరిణితి చెందిన అమ్మాయి అబ్బాయి ప్రేమ కథను చూడటం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి కథలు మనం తరచుగా చూడనిది. మొదటిసారిగా ఈ చిత్రం ఆహలో విడుదల అవుతుందని ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.
యశ్వంత్ ములుకుట్లకు చెందిన క్రిషివ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ కు చెందిన శరత్ మరార్ సమర్పించారు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







