ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించనున్న వై.ఎస్.ఆర్.సి.పి & APNRTS కువైట్
- June 16, 2020
కువైట్ సిటీ:కరోనా వైరస్ మహమ్మారి వలన గత నాలుగు నెలలు నుంచి పనులు లేక జీతాలు రాక కువైట్ లో ఉన్న మన తెలుగువారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తినడానికి వంట సరుకులు లేక చాలా మంది అవస్ధలు పడుతున్నారు అనారోగ్యంతో, మానసిక ఒత్తిడి పెరిగి ఆరోగ్యం చెడిపోయి, మందులు కొనలేక పలు విధాలుగా అవస్థలు పడుతున్నారు.
ఇటువంటి వంటి అభాగ్యులను ఆదుకునేందుకు కువైట్ లో ఉన్న వివిధ స్వచ్చంద సేవా సంఘాలు ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయపడుతున్న వారందరికీ APNRTS కువైట్ వారి తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.గత 10 సంవత్సరాలుగా సమస్యలలో ఉన్న తెలుగు వారి సమస్యలను వై.ఎస్.ఆర్.సి.పి కువైట్ పరిష్కరిస్తోంది. ఇప్పుడున్న విపత్కర పరిస్థితులలో కూడా ఆమ్నెస్టీ మొదలు అయినప్పటి నుండి కువైట్ APNRTS కో-ఆర్డినేటర్స్ అవుట్ పాస్ తయారు చేయడములో గాని షెల్టర్ లేని వారికి షెల్టర్ ఇవ్వడంలో గాని మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నాము.
APNRTS చైర్మన్ మేడపాటి వెంకట్ మరియు డైరెక్టర్ ఇలియాస్ బి.హెచ్ సలహా మేరకు కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో మరో ముందడుగు వేసి ఆంధ్రప్రదేశ్ ప్రవాస నాన్ రెసిడియన్స్ తెలుగు సొసైటీ ( APNRTS ) మరియు వై.ఎస్.ఆర్.సి.పి కువైట్ సంయుక్తంగా కువైట్ లో ఇబ్బంది పడుతున్న సోదర సోదరి మణులకు.సాధ్యమైనంత మేరకు వంట సామాగ్రి పంపిణీ చేయాలని ఈరోజు కమిటీ నిర్ణయించడం జరిగినది కువైట్ లో ఉన్న తెలుగు సంఘాలను కలుపుకొని సాధ్యమైనంత త్వరలో అర్హులను గుర్తించి చేర్చడం జరుగుతుంది.వై.ఎస్.ఆర్.సి.పి అభిమాని ప్రముఖ పారిశ్రామిక వేత్త కరీం చెప్పలి పెద్దమనస్సుతో గొప్పగా ఆర్థిక సహాయ సహకారాలు అందించిన APNRTS తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ముమ్మడి బాలిరెడ్డి, తంబిళ్ళ దుర్గారెడ్డి కువైట్ దాసరి సంఘము వారు గోవింద్ నాగరాజు, కావేటి రమణా యాదవ్, మంచి మనస్సుతో ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసినందుకు ధన్యవాదములు మరికొంతమంది దాతల సహాయంతో తొందరలో మొదలు పెట్టాలని నిర్ణయించడం జరిగినది.
ఈ సమావేశంలో కువైట్ వై.ఎస్.ఆర్.సి.పి కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, టి.దుర్గారెడ్డి,గోవిందు నాగరాజు,ఎం.వి నరసారెడ్డి,నాయని మహేశ్వర్ రెడ్డి, ఆకుల ప్రభాకర్ రెడ్డి, అబుతురాబ్ కావేటి రమణ యాదవ్, రవి శంకర్,లక్కీ అజీజ్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?