ఆస్కార్ 2021 అవార్డు వేడుక వాయిదా..

- June 16, 2020 , by Maagulf
ఆస్కార్ 2021 అవార్డు వేడుక వాయిదా..

ఆస్కార్ 2021 అవార్డు వేడుక వాయిదా పడింది. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో 8 వారాల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వాయిదా నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో చరిత్రలో నాలుగోసారి ఆస్కార్ వాయిదా పడినట్లయింది. ఆస్కార్ 2021 అవార్డుల కోసం మొదట 28 ఫిబ్రవరి 2021గా నిర్ణయించారు. అయితే కరోనా నేపథ్యంలో ఇది ఇప్పుడు ఏప్రిల్ 25న జరుగుతుందని ప్రకటించింది.

అంతేకాదు ఆస్కార్ 2021 అవార్డుల వేడుకకోసం నామినేషన్ తేదీని కూడా డిసెంబర్ 31 నుండి ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నిర్ణయించింది. కాగా ఆస్కార్ అవార్డుల వేడుక మొదటిసారి లాస్ ఏంజిల్స్‌లో వచ్సిన వరదల కారణంగా వాయిదా పడ్డాయి. ఆ తరువాత 1968 లో, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య నేపథ్యంలో రెండు రోజులపాటు ఆలశ్యం అయ్యాయి. ఇక 1981లో24 గంటలపాటు నిలిపివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com