కోవిడ్‌ 19: ఫ్రాడ్‌ పీపీఈ గ్యాంగ్‌ అరెస్ట్‌

- June 16, 2020 , by Maagulf
కోవిడ్‌ 19: ఫ్రాడ్‌ పీపీఈ గ్యాంగ్‌ అరెస్ట్‌

కువైట్‌ పోలీస్‌, ఫార్మసీలను మోసం చేస్తున్న ఓ గ్యాంగ్‌ని అరెస్ట్‌ చేయడం జరిగింది. నిందితులు, ఫార్మసీల నుంచి పెద్దయెత్తున పీపీఈ కిట్లు, మాస్క్‌లు కొనుగోలు చేసి, వారికి ఫేక్‌ చెక్‌లను అందిస్తున్నారనే ఫిర్యాదు మేరకు పోలీసు యంత్రాంగం విచారణ చేపట్టింది. ఫార్మసీలను మోసం చేసి ఆ గ్యాంగ్‌, ఆయా కిట్స్‌ని ఆ తర్వాత ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్‌లో ఓ లెబనీస్‌, ఓ ఈజిప్టియన్‌తోపాటు ఓ ఇండియన్‌ కూడా వున్నట్లు అధికారులు తెలిపారు. మరికొందరు కూడా ఈ గ్యాంగ్‌లో సభ్యులుగా వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com