ఫేక్‌ ప్రకటనలపై మినిస్ట్రీ హెచ్చరిక

- June 16, 2020 , by Maagulf
ఫేక్‌ ప్రకటనలపై మినిస్ట్రీ హెచ్చరిక

రియాద్‌: సౌదీ మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌, ఇల్లీగల్‌ అడ్వర్‌టైజ్‌మెంట్స్‌ పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తోంది. మినిస్ట్రీ అధికార ప్రతినిధి¸ అబ్దుల్‌ రహ్మాన్‌ అల్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ, మినిస్టర్‌ ఫొటోల్ని ఉపయోగించి ఫేక్‌ ప్రచారానికి దిగడం చట్ట రీత్యా నేరమని హెచ్చరించారు. ఇ-కామర్స్‌ రెగ్యులేషన్స్‌ని ఉల్లంఘించేవారిపై కరిన చర్యలు తీసుకుంటామని చెప్పారాయన. 1 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ వరకూ ఇలాంటి నేరాలకు జరీమానా విధించే అవకాశం వుంది. ఈ తరహా ప్రకటనల విషయంలో మినిస్ట్రీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోందనీ, సోర్స్‌ని కనిపెట్టి నిందితుల పనిపడ్తామని, అదే సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com