న్యూ ఢిల్లీ:కోవిడ్-19 ఆస్పత్రిగా మారిన స్టార్ హోటల్

- June 16, 2020 , by Maagulf
న్యూ ఢిల్లీ:కోవిడ్-19 ఆస్పత్రిగా మారిన స్టార్ హోటల్

న్యూ ఢిల్లీ: భారత దేశ రాజధానిలో కోవిడ్-19 కేసులు పెరగడంతో ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోయాయి. దీంతో ఢిల్లీలోని ఫైవ్ స్టార్ తాజ్ మాన్ సింగ్ హోటల్.. సర్ గంగారాం ఆస్పత్రికి అనుబంధంగా సేవలందించే బాధ్యతను చేపట్టాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రోగులు హోటల్ లో ఉన్నందుకు రూ.5000తో పాటు వైద్య సేవలకు మరో రూ.5000 చెల్లించవలసి ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్ పెడితే రోజుకు 2000 చెల్లించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యక్తిగత రక్షణ పరికరాలు అందజేయడంతో పాటు మౌలిక అంశాల్లో శిక్షణ కల్పిస్తారు హోటల్ సిబ్బందికి. కరోనా కేసులు పెరిగిపోవడంతో ఢిల్లీ ఆస్పత్రుల్లో చాలినన్ని బెడ్స్ లేక హోటల్స్ ను ఆస్పత్రులకు అటాచ్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com