రెంట్‌ రిలీఫ్‌ కోరుతున్న రెసిడెన్షియల్‌ టెనెంట్స్‌

- June 16, 2020 , by Maagulf
రెంట్‌ రిలీఫ్‌ కోరుతున్న రెసిడెన్షియల్‌ టెనెంట్స్‌

దుబాయ్‌: దుబాయ్‌లో రెసిడెన్షియల్‌ టెనెంట్స్‌, రెంట్‌ రిలీఫ్‌ని కోరుతున్నారు. ల్యాండ్‌ లార్డ్స్‌ నుంచి కనీసం నెల లేదా రెండు నెలల రెంట్‌ వెయివర్‌ అయినా లభిస్తే బావుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రెసిడెన్షియల్‌ టెనెంట్స్‌. కరోనా వైరస్‌ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక పరిస్థితి వచ్చిందన్నది వారి వాదన. అయితే, ల్యాండ్‌ లార్డ్స్‌ అంతా ఇందుకు సానుకూలంగా స్పందించే అవకాశం లేదు. కాగా, కొందరు ల్యాండ్‌ లార్డ్స్‌.. రెంటల్‌ పేమెంట్స్‌ విషయంలో కొంత వెసులుబాటు కల్పించే అవకాశం వుంది. ఆ మొత్తాన్ని కొంత కాలం తర్వాత చెల్లించడం.. వంటి అంశాల్ని కొందరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మాత్రం, టెనెంట్స్‌ కోరిన మేర వెసులుబాట్లు కల్పించడానికి కూడా ముందుకొచ్చే అవకాశాలు వున్నట్లు లీజింగ్‌ ఏజెంట్స్‌ కొందరు అభిప్రాయపడుతున్నారు. ల్యాండ్‌ లార్డ్స్‌కి కూడా ఫైనాన్షియల్‌ కమిట్‌మెంట్స్‌ వుంటాయి గనుక.. అందరూ సానుకూలంగా ఈ విషయమై స్పందించడం కష్టమన్నది వారి వాదన. దుబాయ్‌ రెంటల్‌ డిస్‌ప్యూట్‌ సెటిల్‌మెంట్‌ సెంటర్‌ జడ్జిమెంట్‌ ప్రకారం, టెనెంట్‌ తన ఉద్యోగాన్ని కోల్పోయిన సందర్భంలో ప్రత్యేక పరిస్థితుల్లో లీజ్‌ కాంట్రాక్ట్‌ని ల్యాండ్‌ లార్డ్‌తో రద్దు చేసుకునే అవకాశం వుంది. ముందస్తు అగ్రిమెంట్‌ రద్దు నేపథ్యంలో ల్యాండ్‌ లార్డ్‌ ఎలాంటి పెనాల్టీ విధించడానికి వీల్లేదని కూడా జడ్జిమెంట్‌ చెబుతోంది. దీనికి సంబంధించి టెనెంట్స్‌ అవసరమైన ఆధారాల్ని సమీకరించుకోవాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com