జులైలోనే అంతర్జాతీయ విమాన సేవల పై నిర్ణయం-పూరీ

- June 16, 2020 , by Maagulf
జులైలోనే అంతర్జాతీయ విమాన సేవల పై నిర్ణయం-పూరీ

న్యూ ఢిల్లీ:భారత దేశవ్యాప్తంగా రోజు రోజుకి కోవిడ్-19 వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత కొనసాగుతోంది. లాక్‌డౌన్‌కు భారీ సడలింపులు ప్రకటించిన క్రమంలో అంతర్జాతీయ విమాన రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాలపై నియంత్రణలను ఎత్తివేసే దిశగా వచ్చే నెలలో నిర్ణయం వెలువడుతుందని పౌర విమానయాన మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ మంగళవారం పేర్కొన్నారు.

ప్రయాణీకులు, ఎయిర్‌లైన్స్‌ సహా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి పూరీ తెలిపారు. అంతర్జాతీయ విమాన సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయని నిర్ధిష్టంగా తాను వెల్లడించలేనని చెప్పారు. కాగా ఎయిర్‌పోర్ట్‌ల్లో విమానాల సంఖ్యపై పరిమితులతో మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులను అనుమతించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com