ఒక అనాథ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న మహాస్ క్రియేషన్స్ చిత్రం
- June 16, 2020
చేతన్ శీను హీరోగా మహాస్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ఒక సినిమా రూపొందుతోంది. మధువర్మ దర్శకత్వంలో ఆళ్ల వెంకట్ (ఏవీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వర్షిణి బన్నీ వాక్స్ హీరోయిన్గా పరిచయమవుతోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె పోషిస్తోన్న మహా (మహాలక్ష్మి) క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ను చిత్రం బృందం విడుదల చేసింది. లంగా వోణీ ధరించి ఒక చేతిలో పుస్తకం, భుజాన బ్యాగ్‌తో కాలేజీ స్టూడెంట్ లుక్‌లో ఆమె ఆకట్టుకుంటోంది.
తన ప్రేమ కోసం ఒంటరిగా పోరాడటమే కాకుండా.. మూఢ నమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా కూడా పోరాడే ఒక అనాథ ప్రేమకథ ఈ చిత్రం. బాపట్లలో అగ్రికల్చరల్ డిగ్రీ చదువుతుండే అతనికి అక్కడే ఒక అమ్మాయి పరిచయమై, అది ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత అతను ఎలాంటి పరిణామాలు, పరిస్థితులు ఎదుర్కొన్నాడనేదే ఈ చిత్రంలోని ప్రధానాంశం. ఆద్యంతం ఆసక్తికర కథనంతో ఈ చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దుతున్నాడనీ, చక్కని నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారనీ చిత్ర బృందం తెలిపింది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఒక షెడ్యూల్‌ను గుంటూరు పరిసరాల్లో, మరో షెడ్యూల్‌ను రాజమండ్రి, వైజాగ్, అరకు ప్రాంతాల్లో జరిపారు. మూడో షెడ్యూల్‌ను తెలుగు రాష్ట్రాల బయట నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని అనుమతులూ లభించగానే షెడ్యూల్‌ను మొదలు పెట్టేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది.
తారాగణం:
చేతన్ శీను, వర్షిణి బన్నీ వాక్స్, మణిచందన, రఘుబాబు, జీవా, టీఎన్ఆర్, నవీన్ నేని, యడం రాజు, నాగమహేష్, పవన్ సురేష్
సాంకేతిక వర్గం:
మ్యూజిక్: బల్గనిన్
సినిమాటోగ్రాఫర్: కన్నయ్య సిహెచ్.
ఎడిటర్: బి. నాగేశ్వరరెడ్డి
స్టంట్స్: రామకృష్ణ
కొరియోగ్రఫీ: అనీష్
లైన్ ప్రొడ్యూసర్: వంశీ తాడికొండ
సహ నిర్మాత: రామకృష్ణ రేజేటి (ఆర్ఆర్కె)
నిర్మాత: ఆళ్ల వెంకట్ (ఏవీ)
డైరెక్టర్: మధువర్మ
బ్యానర్: మహాస్ క్రియేషన్స్
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







