కువైట్:ఇండియా వెళ్లే ఛార్టెడ్ ఫ్లైట్స్ కు భారీ స్పందన

- June 17, 2020 , by Maagulf
కువైట్:ఇండియా వెళ్లే ఛార్టెడ్ ఫ్లైట్స్ కు భారీ స్పందన

కువైట్ సిటీ:అల్ బేకర్ గ్రూప్ కు చెందిన అల్ టేయర్ ట్రావెల్స్ తమ మొదటి చార్టెడ్ ఫ్లైట్ ను నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నడుపుతామని అంచనా వేస్తోంది. కువైట్ లో ఉన్న ప్రవాస భారతీయులను ఇండియాకు తీసుకెళ్లేందుకు అల్ టేయర్ ప్రైవేట్ ట్రావెల్స్ చెన్నైకి ప్రత్యేకంగా విమాన సర్వీసులను నడుపేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. భారత్ కు వెళ్లే ఛార్టెడ్ ఫ్లైట్స్ కు ప్రయాణికుల నుంచి భారీ స్పందన వస్తోందని టేయర్ ట్రావెల్స్ వెల్లడించింది. ఇప్పటికే తమ షెడ్యూల్ ప్రకారం నిర్ణయించిన విమానాలకు సంబంధించి అన్ని టికెట్లు బుక్ అయిపోయాయని సంస్థ తెలిపింది. ఇక టికెట్ల కోసం ఎవరూ తమను సంప్రదించొద్దని కూడా టేయర్ ట్రావెల్స్ వెల్లడించింది. ప్రయాణికుల వివరాలతో కూడిన జాబితాను సంబంధిత అధికారులకు పంపించామని, వారి నుంచి అనుమతి రాగానే ప్రయాణ సమయాన్ని ఫోన్ ద్వారా సమాచారం అందిస్తామని చెబుతోంది. కరోనా నేపథ్యంలో ప్రయాణ వివరాలకు సంబంధించి ప్రయాణికులు ఎవరూ తమ కార్యాలయానికి తరచుగా రావొద్దని, ఎలాంటి సందేహాలు ఉన్నా.. 65732220 నెంబర్ కు డయల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. మూడు, నాలుగు రోజుల్లో అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే..ఒక వేళ అనుమతులకు సంబంధించి ఎవైనా అవాంతరాలు ఏర్పడి చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేయాల్సి వస్తే..టికెట్ డబ్బులను రెండు, మూడు రోజుల్లో పూర్తిగా చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు ట్రావెల్స్ నిర్వాహకులు. ఇక కోవిడ్ నేపథ్యంలో ప్రతి ప్రయాణికుడికి ఫేస్ షీల్డ్ కవర్ తో పాటు చిన్న శానిటైజర్ బాటిల్, ఫేస్ మాస్క్ పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com