తెలంగాణ లో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు
- June 16, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన గంటల్లో కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కరోనా సోకి నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ కరోనాతో 191 మంది చనిపోయారు.మొత్తం 5406 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఇంకా 2188 మంది యాక్టీవ్ కేసులుగా ఉన్నారు. మంగళవారం 261 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 3027 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా GHMC పరిధిలోనే 165 పాజటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 16, మెదక్‌లో 13, కరీంనగర్లో 6, మేడ్చల్‌లో 3, నిజామాబాద్, సంగారెడ్డిలో 2, ఆసీఫాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రిభువనగిరిలో ఒక్కొక్కరు చొప్పున కరోనా బారిన పడ్డారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







