పుతిన్ రక్షణకు ఏకంగా ఒక భారీ టన్నెల్ ఏర్పాటు
- June 17, 2020
మాస్కో : రష్యాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వైరస్ బారీన పడకుండా ఉండేందుకు ప్రత్యేకమైన డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేసినట్లు ఆర్ఐఏ అనే వార్త సంస్థ తన రిపోర్టులో నివేదించింది. ఈ మేరకు అక్కడి భద్రతా అధికారులు రక్షణా చర్యలు చేపట్టారు. ఎవరైనా సరే పుతిన్ నివాసం ఉంటున్న భవనానికి రావాలంటే డిస్ఇన్ఫెక్షన్ టనెల్ మార్గం ద్వారా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. పెన్జా పట్టణానికి చెందిన రష్యన్ కంపెనీ ఈ టన్నెల్‌ను తయారుచేసింది.
దీనిని మాస్కోలో ఉన్న పుతిన్ అధికారిక భవనం నోవో-ఒగారియోవో ముందు ఏర్పాటు చేశారు. పుతిన్‌ను కలవడానికి వచ్చే సందర్శకులు ప్రత్యేక సొరంగ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించాల్సి ఉంటుందని తెలిపారు. సొరంగ మార్గంలో ఏర్పాటు చేసిన సీలింగ్, పక్కల నుంచి క్రిమిసంహారక మందును పిచికారి చేస్తారు. దీంతో పాటు టెన్నెల్లో సీసీటీవీ ఏర్పాటు చేశారు. రష్యాలో ఇప్పటి వరకు 5,29,000 కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న రష్యాలో ఇప్పటి వరకు కరోనా వల్ల 7284 మంది మరణించారు.
В резиденции Путина для защиты от коронавируса установили специальный туннель. Он предназначен для дезинфекцииhttps://t.co/jjwWbuZ2EX pic.twitter.com/h62KWARvsr
— РИА Новости (@rianru) June 16, 2020
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన