దోహా:వర్చువల్ స్పోర్ట్స్ నిర్వహణకు సిద్ధమైన ఖతార్ ఒలంపిక్ కమిటి
- June 17, 2020
దోహా:లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటున్న వారి కోసం ఖతార్ ఒలంపిక్ కమిటీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. నాలుగు వారాల పాటు వర్చువల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ నిర్వహించబోతోంది. ఖతార్ ఒలంపిక్ కమిటి కు సోషల్ మీడియా వేదికగా ఆన్ లైన్ లో సైక్లింగ్, రన్నింగ్, ఆర్ట్స్, డ్రాయింగ్, యోగా లాంటి ఈవెంట్స్ చేపట్టనుంది. ఇందుకోసం సోషల్ మీడియా ద్వారా ప్రముఖ క్రీడాకారులతో చిన్నారులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించనుంది. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన వాళ్లు ఈ క్లాసుల ద్వారా ఫిట్ నెస్ పెంపొందించుకునేలా ప్రణాళికను సిద్ధం చేసుకుంది కమిటి. ఇంటి వద్ద ఫిట్నెస్ కాపాడుకునేందుకు చేస్తున్న కసరత్తు వీడియోలను, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటిస్ వీడియోలను సంక్షిప్తంగా పంపించాలని కూడా కమిటి సూచించింది. వివిధ కేటగిరిలో 5, 10 కిలోమీటర్ల సైక్లింగ్, రన్నింగ్, డ్రాయింగ్, ఆర్ట్స్, యోగా పోటీలను నిర్వహించి..కాంపిటిషన్ లో గెలుపొందిన వారికి 30,000 డాలర్ల క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు. గృహనిర్బంధంలో ఉన్న వారు మానసికంగా, శారీరకంగా దృఢంగా అయ్యేందుకు ఈ వర్చువల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు ఖతార్ ఒలంపిక్ కమిటి వెల్లడించింది.
తాజా వార్తలు
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం







