'కవ్వింత' ఫేమ్ విజయ్ చౌదరి త్రిపురనేని దర్శకత్వంలో ఫై చిత్రం
- June 18, 2020
ఫైవ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు తేళ్ల రమేష్ సన్నాహాలు చేస్తున్నారు. తొలి చిత్రం 'కవ్వింత'తో ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న విజయ్ చౌదరి త్రిపురనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
దర్శకుడు విజయ్ చౌదరి త్రిపురనేని మాట్లాడుతూ, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాని రూపొందిస్తామన్నారు. ఒక యంగ్ హీరో ఈ సినిమాలో నటిస్తారనీ, అందరూ టాప్ టెక్నీషియన్లతో పనిచేస్తామనీ ఆయన చెప్పారు.
నిర్మాత తేళ్ల రమేష్ మాట్లాడుతూ, ఈ ఏడాది చివరలో షూటింగ్‌ను ప్రారంభిస్తామన్నారు. దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చిందనీ, 'కవ్వింత' తర్వాత ఇది ఆయనకు రెండో సినిమా అనీ చెప్పారు. ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు..
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు