మస్కట్:కేరళ వెళ్లే భారతీయులకు కోవిడ్ 19 టెస్టులు తప్పనిసరి
- June 18, 2020
ఒమన్ నుంచి కేరళ వెళ్లే ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా కోవిడ్ 19 టెస్టులు చేయించుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒమన్ లోని ప్రవాసభారతీయులను స్వదేశానికి తరలిచేందుకు జూన్ 20 నుంచి విమాన సర్వీసులు నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే..విదేశాల నుంచి కేరళ వస్తున్న ప్రవాసీయుల్లో దాదాపు 20 శాతం మందికి కరోనా బారిన పడిన వారేనని ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కరోనా సోకిన వ్యక్తులతో విమాన ప్రయాణికుల్లోని మిగిలిన వారికి కూడా హై రిస్క్ పొంచి ఉండటంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వందే భారత్ మిషన్ లో భాగంగా నడుపుతున్న విమానాల్లోగానీ, చార్టెడ్ ఫ్లైట్స్ లో గానీ కేరళ వెళ్లే ప్రయాణికులు అంతా తప్పనిసరిగా కోవిడ్ 19 నెగటివ్ సర్టిఫికెట్ ను బోర్డింగ్ సమయంలోనే తమ వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కోవిడ్ 19 టెస్ట్ రిపోర్ట్స్ లేని వారిని ప్రయాణానికి అనుమతించరు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు