విమాన ప్రయాణాలపై వస్తున్న ప్రొటోకాల్ పుకార్లను ఖండించిన యూఏఈ

- June 18, 2020 , by Maagulf
విమాన ప్రయాణాలపై వస్తున్న ప్రొటోకాల్ పుకార్లను ఖండించిన యూఏఈ

దుబాయ్:జూన్ 23 నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికుల విషయంలో యూఏఈ ప్రోటోకాల్ కు సంబంధించి ప్రయాణికుల్లో నెలకొన్న అపోహలపై యూఏఈ స్పష్టతనిచ్చింది. ప్రోటోకాల్ పై అనవసర పుకార్లను నమ్మొద్దని జాతీయ భద్రతా విభాగంలోని జాతీయ విపత్తు నిర్వహణ సుప్రీం కౌన్సిల్ అధికారులు తెలిపారు. గత బుధవారమే విమాన ప్రయాణాలకు సంబంధించి ప్రయాణికులు స్పష్టమైన సూచనలు చేశామని, అధికార వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రయాణికులు పరిగణలోకి తీసుకోవాలని కూడా క్లారిటీ ఇచ్చారు. యూఏఈ పౌరులు, ప్రయాణికులు తాము వెళ్లే దేశాలను బట్టి మూడు కేటగిరిలుగా విభజించామని వివరించారు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న దేశాలను లో రిస్క్ దేశాలుగా పరిగణిస్తున్నామని, ఆయా దేశాలకు ఎవరైనా నిరభ్యంతరంగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. అదేవిధంగా ఓ మాదిరిగా కరోనా ప్రభావం ఉన్న దేశాలను మిడియం రిస్క్ జోన్ దేశాలుగా పరిగణిస్తున్నామని..మిడియం రిస్క్ దేశాలకు ప్రత్యేక కారణాలు, అత్యవసర పనులు ఉన్నవారికి మాత్రమే ప్రయాణించే వెసులుబాటు ఉంటుందన్నారు. ఇక కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలను హై రిస్క్ కంట్రీస్ గా గుర్తించి ఆయా దేశాలకు ప్రయాణాలకు అనుమతించబోవటం లేదని జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com