తెలంగాణలో 352 కరోనా పాజిటివ్ కేసులు
- June 18, 2020
హైదరాబాద్:తెలంగాణలో గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నేడు మరో ముగ్గురు కరోనాతో మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 195గా నమోదైంది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 3301 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2531 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఒక్క రోజే ఇంత భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం GHMC పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







