కువైట్:ఆదివారం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభం

- June 20, 2020 , by Maagulf
కువైట్:ఆదివారం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభం

కువైట్ సిటీ:కువైట్ లో మళ్లీ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఆదివారం(జూన్ 21) నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం నుంచి సాధారణ ట్రాఫిక్ విభాగం వాహనాల రిజిష్ట్రేషన్లను ప్రారంభిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. అన్ని గవర్నరేట్ల పరిధిలోని ట్రాఫిక్ ఆఫీసులలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్ సేవలను అందించనున్నారు. అయితే..వాహనాల రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన వాళ్లు..గతంలో రిజిస్ట్రేషన్ పరిశీల నుంచి మినహాయింపు పొందిన వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com