విజయవాడ నుండి నిజామాబాద్ కు బస్సు కోసం తెలంగాణ గల్ఫ్ కార్మికుల విజ్ఞప్తి
- June 20, 2020
తెలంగాణ:32 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు ఈనెల 14న (14.06.2020) ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో బహ్రెయిన్ నుండి విజయవాడకు చేరుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ కార్మికులకు కూడా ఉచిత క్వారంటైన్ సౌకర్యం కల్పించడం విశేషం.వారం రోజుల సంస్థాగత క్వారంటైన్ గడువు ఈనెల 21తో ముగుస్తున్నందున స్వగ్రామాలకు వెళ్లేందుకు వీరంతా సిద్ధమవుతున్నారు. తమకు విజయవాడ నుండి నిజామాబాద్ వరకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని వీరందరూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
వీరిలో ఎక్కువ మంది ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారు ఉన్నందున విజయవాడ నుండి కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, ఆర్మూర్ ల మీదుగా నిజామాబాద్ వరకు బస్సు ఏర్పాటు చేయాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మాజీఎంపీ కవిత లను కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు