`సీటీమార్` లో ఆంధ్ర కబడ్డీ టీం కోచ్ గా గోపీచంద్
- June 20, 2020
ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం `సీటీమార్`. జూన్ 20 సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా `సీటీమార్` చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో నిర్మించబడుతున్న విషయం అందరికీ తెలిసిందే...ఈ సంవత్సరంలో మొదలయిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మిగిలిన భాగాన్ని ఆగస్ట్ మొదటివారం నుండి షూటింగ్ మొదలుపెట్టి ఒకే షెడ్యూల్లో సినిమాని కంప్లీట్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్దమవుతుంది.
ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్ గా గోపిచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్గా తమన్నా నటిస్తున్నారు. విలేజ్ లో ఉండి హీరోని ప్రేమించే ఒక ప్రత్యేక పాత్రలో మరో హీరోయిన్ దిగంగన నటిస్తుండగా చాలా ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, భూమిక, రెహమాన్, బాలివుడ్ యాక్టర్ తరుణ్ అరోరా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి
డిఓపి: సౌందర్ రాజన్,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్: తమ్మిరాజు,
ఆర్ట్ డైరెక్టర్: సత్యనారాయణ డి.వై,
సమర్పణ: పవన్ కుమార్,
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,
కథ-మాటలు-స్క్రీన్ప్లే- దర్శకత్వం: సంపత్ నంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు