బ్రేకింగ్..బ్రేకింగ్..రూ 103కే అందుబాటులోకి రానున్న కరోనా మందు

- June 20, 2020 , by Maagulf
బ్రేకింగ్..బ్రేకింగ్..రూ 103కే అందుబాటులోకి రానున్న కరోనా మందు

 

కరోనా రోగుల చికిత్స కోసం ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ సంస్థ Glenmark Pharmaceuticals కంపెనీ ప్రకటించింది. యాంటీవైరల్​ డ్రగ్​ ఫవిపిరావీర్ ఫాబిఫ్లూ పేరుతో తీసుకొచ్చినట్లు తెలిపింది. వైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం 'ఫవిపిరావీర్​' అనే ఔషధాన్ని ఆవిష్కరించింది ఫార్మాస్యూటికల్ సంస్థ గ్లెన్​మార్క్.

ఫాబిఫ్లూ బ్రాండ్​ పేరుతో తెస్తున్న ఈ ఔషధం తేలికపాటి లేదా ఓ మోస్తరు స్థాయిలో కరోనాతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుందని పేర్కొంది. వైరస్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడే ఈ మెడిసిన్ తీసుకుంటే ప్రాణాలతో బయటపడొచ్చు. ప్రస్తుతం ఈ కంపెనీ ఇండియాలో మార్కెటింగ్ తో పాటు మాన్యుఫ్యాక్చరింగ్ కు సైతం అప్రూవల్ సంపాదించుకుంది. 

ఒక 200 ఎంజీ టాబ్లెట్ ధర సుమారు రూ.103 వరకు ఉంటుందని, 34 టాబ్లెట్​లు ఉండే ఓ స్ట్రిప్... గరిష్ఠ రిటైల్ ధర రూ.3వేల 500 వరకు ఉంటుందని గ్లెన్​మార్క్ వెల్లడించింది. ట్రీట్‌మెంట్‌లో భాగంగా రోజుకు 4ట్యాబ్లెట్లు వేసుకోవాలని.. తొలి రోజు మాత్రం 200mg ట్యాబ్లెట్లు 9తీసుకోవాల్సిందేనని చెప్తున్నారు. కరోనా పేషెంట్ల మీద 80శాతం కచ్చితత్వంతో మందు పనిచేస్తుందని చెప్తున్నారు.

కరోనా రోగుల చికిత్స కోసం ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ సంస్థ గ్లెన్​మార్క్​ ప్రకటించింది. మెడిసిన్ మార్కెటింగ్ చేసి అమ్ముకునేందుకు ఇతర ఇండియా కంపెనీలు అయిన Delhi-Brinton Pharmaceuticals, Bengaluru-Strides Pharma, Mumbai-Lasa Supergenerics, Hyderabad-Optimus Pharma లు ఆమోదం పొందాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com