ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు..

- June 21, 2020 , by Maagulf
ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు..

ప్రపంచ యోగా దినోత్సవమును ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు వెనువెంటనే 193 ప్రపంచ దేశాలు తమ మద్ధతును ప్రకటించాయి. తరువాత డిసెంబరు 11 న ఐక్యరాజ్యసమితి భారత ప్రధాని సూచించిన జూన్ 21 నాడు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవమును జరుపుకోవాలని అధికారిక ప్రకటన చేసింది.అయితే ఈ ప్రపంచ యోగ దినోత్సవ సందర్భంగా అసలు యోగా  అంటే ఏమిటి,అవి ఎన్ని రకాలు ఉంటాయి,దానివల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

యోగా వల్ల కలిగే ఉపయోగాలు:

  • యోగా మానవుని జీవన శైలిని సులభతరం చేయడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచడంతోపాటు జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.
  • మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా ప్రథమ స్థానాన్ని సంపాదించుకుంది.
  • భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంది.
  • ఏ వ్యాయామంతో కూడా పోల్చి చూసినా యోగాలో ఉన్న చాలా విశిష్టతలు ప్రత్యేకంగా ఉన్నాయి.
  • యోగాకు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉంది.
  • యోగా కేవలం శరీరంపై మాత్రమే కాదు.. మెదడు, ఆత్మ ఇలా అన్నింటిని వృద్ధి చేయడంలో యోగ కీలకపాత్ర పోషిస్తుంది.
  • ఆరోగ్యం మెరుగుపడటానికి యోగకు మించిన సాధనం లేదు.
  • యోగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, నరాల లోపల ఏదైనా అడ్డుపడినా తొలగిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
  • క్రమం తప్పకుండా యోగ చేస్తే వృద్యాప్యంలో వచ్చే ఎముకల వ్యాధి, కీళ్ల నొప్పులు రాకుండా.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com