సరిహద్దు ఉద్రిక్తత పై భారత్-చైనాతో మాట్లాడుతున్నా - ట్రంప్

సరిహద్దు ఉద్రిక్తత పై భారత్-చైనాతో మాట్లాడుతున్నా -  ట్రంప్

వాషింగ్టన్‌ : భార‌త్‌- చైనా స‌రిహ‌ద్దు మ‌ధ్య‌ సంక్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దీన్ని చాలా పెద్ద స‌మ‌స్య‌గా అభివ‌ర్ణించారు. స‌రిహ‌ద్దులో ఘ‌ర్ష‌ణ‌లు త‌గ్గించేందుకు ఇటు భార‌త్‌తోపాటు అటు చైనాతో కూడా మాట్లాడుతున్నామ‌ని తెలిపారు. క‌రోనా వైర‌స్ సంక్షోభం త‌ర్వాత శ‌నివారం తొలిసారిగా ఓక్ల‌హోమాలో ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన‌డానికి వెళ్తున్న‌ స‌మ‌యంలో ఆయ‌న‌ వైట్‌హౌస్ ద‌గ్గ‌ర మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఉంద‌ని, మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాల‌న్నారు. ఇక‌ ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌డప‌డేందుకు అమెరికా త‌న‌‌వంతు సాయం చేస్తుంద‌‌ని ప్ర‌క‌టించారు. 

 

Back to Top