దుబాయ్:ఇండియ‌న్ కాన్సులేట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు

- June 21, 2020 , by Maagulf
దుబాయ్:ఇండియ‌న్ కాన్సులేట్ ఆధ్వర్యంలో  యోగా దినోత్సవ వేడుకలు

దుబాయ్:దుబాయ్ లోని ఇండియ‌న్ కాన్సులేట్‌లో అంతర్జాతీయ‌ యోగా దినోత్సవ వేడుకలు ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూ కొంత‌మంది ఔత్సాహికులు మాత్ర‌మే ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇండియ‌న్ మిషన్ ఈ కార్య‌క్ర‌మాన్ని త‌న సోష‌ల్ మీడియా సైట్స్‌లో గంటసేపు ప్ర‌త్య‌క్ష‌ప్రసారం చేసింది. ఈ సంద‌ర్భంగా దుబాయ్ లోని భార‌త కాన్సుల్ జ‌న‌ర‌ల్ విపుల్ మాట్లాడుతూ ప్ర‌స్తుత కోవిడ్-19 విప‌త్క‌ర ప‌రిస్థితుల నుండి బ‌య‌ట‌కు రావ‌డంలో యోగా ముఖ్య భూమిక పోషిస్తుంద‌న్నారు. యూఏఈలోని వివిధ క‌మ్యూనిటీస్‌ ఈ సారి యోగా కార్యక్రమాన్ని వర్చువల్‌గా జరప‌డానికి ముందుకు వ‌చ్చిన‌ట్లు విపుల్ పేర్కొన్నారు. ‘యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలి’ పేరిట ఈ ఏడాది భారత ప్రధాని మోదీ పిలుపు మేర‌కు వర్చువల్‌గానే ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలియ‌జేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com