ఏపీలో కొత్తగా 477 కేసులు
- June 21, 2020
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,929కి చేరింది. వైరస్‌బారినపడినవారిలో ఇప్పటివరకు 106 మంది మరణించగా, 4,307 మంది కోలుకున్నారు. మరో 4,516 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. వీరిలో కృష్ణా జిల్లాకు చెందినవారు ముగ్గురు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారు. ఈ రోజు నమోదైన కేసులో రాష్ర్టానికి సంబంధించి 439 కేసులు ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 34 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన నలుగురు ఉన్నారు. అనంతపురం జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 47, గుంటూరులో 26, తూర్పుగోదావరి 70, కడపలో 58, కృష్ణాలో 66, కర్నూలులో 47, నెల్లూరులో 12, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 39, విజయనగరంలో 6, పశ్చిమగోదావరిలో 52 కేసుల చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ కొనసాగుతున్నది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







