నేటి నుంచి క‌ర్ఫ్యూ ఎత్తివేసిన సౌదీ అరేబియా

- June 21, 2020 , by Maagulf
నేటి నుంచి క‌ర్ఫ్యూ ఎత్తివేసిన సౌదీ అరేబియా

రియాద్:మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో 3 నెల‌ల పాటు దేశ‌వ్యాప్తంగా క‌ర్ఫ్యూ విధించిన గ‌ల్ఫ్ కంట్రీ సౌదీ అరేబియా.. నేటి నుంచి క‌ర్ఫ్యూను ఎత్తివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అలాగే ఇవాళ్టితోనే య‌ధావిధిగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమ‌వుతాయ‌ని తెలిపింది. ఇవాళ ఉద‌యం 6 గంట‌ల నుంచే క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు తొలిగిస్తున్న‌ట్లు సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. కానీ... మతపరమైన తీర్థయాత్రలు, అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు, సామాజిక సమావేశాలు(50 మందికి మించ‌కుండా) త‌దిత‌ర అంశాల‌పై ఆంక్ష‌లు అలాగే కొన‌సాగుతాయ‌ని చెప్పింది. 

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు సౌదీ మార్చిలో దేశ‌వ్యాప్తంగా క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. కొన్ని న‌గ‌రాలు, పట్టణాల్లో ఏకంగా 24 గంట‌ల పాటు క‌ర్ఫ్యూ విధించింది కూడా. ఇక మేలో మూడు ద‌శ‌ల్లో క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సౌదీ... జూన్ 21తో పూర్తిగా క‌ర్ఫ్యూను తొల‌గించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com