దుబాయ్:జూలై 7 నుండి విదేశీ పర్యాటకులకు అనుమతి
- June 21, 2020
దుబాయ్: జూలై 7 నుండి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ పర్యాటకులను అనుమతిస్తారని ఆదివారం ప్రకటించారు.పర్యాటకులు కోవిడ్ -19 నెగటివ్ సర్టిఫికేట్ను సమర్పించాలి లేదా విమానాశ్రయంలో పరీక్షలు చేయవలసి ఉంటుంది.దుబాయ్ ఎయిర్పోర్ట్స్ రేపటి నుండి విదేశాలలో చిక్కుకున్న నివాసితులను యూ.ఏ.ఈ రావటానికి అనుమతిస్తారని సుప్రీం కమిటీ తెలిపింది. జూన్ 23 నుండి పౌరులు మరియు నివాసితులను విదేశాలకు వెళ్లడానికి అనుమతించారని కూడా తెలిపింది.
దుబాయ్ ఎయిర్పోర్ట్స్ నుండి ప్రయాణించే పౌరులు, నివాసితులు మరియు పర్యాటకుల కోసం కమిటీ కొత్త ప్రోటోకాల్స్ మరియు షరతులను ప్రకటించారు.
కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకల పై ఆంక్షల వల్ల ప్రభావితమైన వేలాది మందికి వారి ప్రయాణ ప్రణాళికలను తిరిగి ప్రారంభించడానికి ఈ ప్రకటనలు అనుమతిస్తాయని కమిటీ తెలిపింది.
యూ.ఏ.ఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయాలు ప్రకటించబడ్డాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







