ఢిల్లీలో హై అలర్ట్
- June 22, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశ రాజధాని ఢిల్లీలో దాడులకు ఉగ్రవాదులు కుట్రపన్నారన్న నిఘావర్గాల హెచ్చరికలతో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూకాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడ్డారన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధానిలో దాడికి ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. బస్సు, కారు లేదా టాక్సీ ద్వారా ఉగ్రవాదులు దేశ రాజధానిలోకి ప్రవేశించవచ్చని ఇంటలిజెన్స్ హెచ్చరించాయి. దీంతో తనిఖీలు ముమ్మరం చేశారు. గెస్ట్ హౌస్‌లు, హోటళ్లు, బస్సు టెర్మినళ్లు, రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు చేపట్టారు. అణువణువూ గాలిస్తున్నారు. ఢిల్లీ బయట కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాల డీసీపీలు, స్పెషల్ సెల్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్లు హై అలర్ట్‌లో ఉన్నాయి.
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాట్లు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో నిత్యం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కుట్రలు మరింత ఎక్కువయ్యాయని నిఘా వర్గాల సమాచారం. దీంతో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో తనిఖీలను ముమ్మరం చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తం చేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







