చైనా యాప్స్‌పై నిషేధం..!..అబ్బే అదేం లేదంటున్న కేంద్రం
- June 22, 2020
భారత్-చైనా బోర్డర్లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ.. 20 మంది భారత సైనికులు వీరమరణం పొందడంతో భారత్ రగిలిపోతోంది.. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నారు.. చైనా ఉత్పత్తులను బహిష్కరిద్దాం.. ఆ దేశపు యాప్స్‌ను డెలిట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో.. చైనా యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించిందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ నకిలీ వార్తపై ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. చైనాకు చెందిన కొన్ని మొబైల్ యాప్స్‌ను భారత్‌లో నిషేధిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటి పనితీరును పరిమితం చేయాలని టెక్ కంపెనీలకు ప్రభుత్వం సూచిస్తున్నట్లు ఉన్న ఉత్తర్వులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతమవుతోంది. టిక్‌టాక్, హలో సహా పలు యాప్‌లను నిషేధిస్తున్నట్లు ఆ పోస్టులో ఉంది. అయితే, ఆ పోస్టులో ఉన్న ఉత్తర్వులు నకిలీ అని పీఐబీ ట్వీట్ చేసింది. ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన