యూఏఈ కి తిరిగివస్తున్న నివాసితులు పాటించాల్సిన నియమాలు
- June 22, 2020
దుబాయ్: కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా విమానాల రాకపోకల పై ఆంక్షల వల్ల ఎందరో విదేశాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. నేటి నుండి విదేశాలలో చిక్కుకున్న పౌరులు/నివాసితులు యూఏఈ రానున్నందున, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ వీరిని స్వాగతించేందుకు సన్నద్ధమైంది. అయితే వీరు పాటించాల్సిన కొన్ని నియమాలను ప్రభుత్వం విడుదల చేసింది.
పిసిఆర్ టెస్ట్
ఏదేని దేశం నుంచైనా దుబాయ్ వచ్చే నివాసితులు తమ ప్రయాణానికి ముందు పిసిఆర్ టెస్టు చేయించుకోనక్కర్లేదు కానీ, దుబాయ్ చేరిన వెంటనే వారికి పిసిఆర్ పరీక్ష నిర్వహించబడుతుంది. పరీక్ష ఫలితం లభించే వరకు నివాసితులు తమ ఇళ్లకే పరిమితం చేయబడతారు.
ప్రయాణ ఆమోదాలు
నివాసితులు ఏదైనా విమానయాన సంస్థలో విమానాలను బుక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఆమోదాలు దుబాయ్ యొక్క జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు విదేశీయుల వ్యవహారాలు నిర్వహిస్తాయి. నివాసితులు తిరిగి రావడానికి విమాన టిక్కెట్లు మరియు ఆమోదం రెండూ ఉండాలి.
ఆరోగ్య ప్రకటన
COVID-19 లక్షణాలను ప్రదర్శించే ప్రయాణీకులకు ప్రవేశాన్ని తిరస్కరించే హక్కును విమానయాన సంస్థలు కలిగి ఉండగా, నివాసితులు ఎక్కడానికి ముందు ఆరోగ్య ప్రకటన పత్రంలో సంతకం చేయాలి. నివాసితులు తప్పనిసరిగా COVID-19 దుబాయ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలి. పిసిఆర్ ఫలితం పాజిటివ్ వచ్చిన యెడల, నివాసితులు అధికారులు సూచించే నిర్బంధ మరియు ఇతర దశలను తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం ఉంది.
నిర్బంధ మరియు చికిత్స ఖర్చులు
దుబాయ్‌కి తిరిగి వచ్చే నివాసితులు చికిత్స యొక్క అవసరమైన నిర్బంధ మరియు చికిత్స ఖర్చులను భరించడానికి సిద్ధంగా ఉండాలి. దీనికి సంబంధించి COVID-19 పరీక్షలో పాజిటివ్ వచ్చినచో చికిత్స ఖర్చులను భరించేందుకు మద్దతు తెలుపుతూ వారు ఒక ప్రకటనపై సంతకం చేయవలసి ఉంది.
ఇంట్లో క్వారంటైన్ అవ్వొచ్చా?
తప్పకుండా.., అయితే నిర్బంధం యొక్క షరతులు నెరవేరితేనే ఇంటి నిర్బంధం అనుమతించబడుతుంది. ఏదేమైనా, COVID-19 పాజిటివ్ కేసులు తమ గృహంలో వేరేవారితో షేరింగ్ పరిస్థితులలో నివసిస్తుంటే లేదా ఎక్కువమందితో కలిసి నివసిస్తుంటే, వారి యజమాని తగిన నిర్బంధ సౌకర్యాన్ని (COVID-19 కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మార్గదర్శకాల ఆధారంగా) అందించాలి లేదా ప్రభుత్వ నిర్బంధ సౌకర్యం ఎన్నుకోవాలి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







