జులై 1 నుంచి బహ్రెయిన్‌ సమ్మర్‌ ఔట్‌ డోర్‌ వర్క్‌ బ్యాన్‌

- June 22, 2020 , by Maagulf
జులై 1 నుంచి బహ్రెయిన్‌ సమ్మర్‌ ఔట్‌ డోర్‌ వర్క్‌ బ్యాన్‌

మనామా:జులై మరియు ఆగస్ట్‌లలో ఔట్‌ డోర్‌ వర్క్‌ బ్యాన్‌ని అమలు చేయడానికి అన్ని సన్నాహాలూ పూర్తి చేస్తున్నట్లు బహ్రెయిన్‌ లేబర్‌ మరియు సోషల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీ పేర్కొంది. ప్రతి యేడాదీ ఈ సీజన్‌లో ఔట్‌డోర్‌ వర్క్‌ బ్యాన్‌ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వర్క్‌ బ్యాన్‌ వుంటుంది. జులై, ఆగస్ట్‌ నెలల్లో వీటిని అమలు చేస్తారు. వేసవి సీజన్‌లో, ఎండ తీవ్రత నుంచి కార్మికుల్ని రక్షించడమే ఈ వర్క్‌ బ్యాన్‌ ఉద్దేశ్యం. లేబర్‌ మినిస్ట్రీ ఇప్పటికే అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్స్ ని ప్రారంభించింది. వర్చువల్‌ వర్క్‌ షాప్‌లను కూడా నిర్వహిస్తోంది. 98 శాతం ప్రైవేట్‌ సెక్టార్‌ కంపెనీలు నిబంధనలు పాటిస్తున్నాయని ఈ సందర్భంగా మినిస్టర్‌ జమెల్‌ బిన్‌ మొహమ్మద్‌ అలి హుమైదీన్‌ చెప్పారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే 3 నెలలకు మించకుండా జైలు శిక్ష, 600 నుంచి 1000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధిస్తారు. ఉల్లంఘనల విషయంలో అస్సలేమాత్రం ఉపేక్షించేది లేదని మినిస్టర్‌ స్పష్టం చేశారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com