అడిషనల్ డిజిగా భాద్యతలు స్వీకరించిన మహేష్ భగవత్

- June 22, 2020 , by Maagulf
అడిషనల్ డిజిగా భాద్యతలు స్వీకరించిన మహేష్ భగవత్

హైదరాబాద్:రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఈ రోజు అడిషనల్ డిజిగా భాద్యతలు స్వీకరించారు. ప్రస్తుతం అతను రాచకొండ కమిషనర్ గా కొనసాగనున్నారు. 1995 సివిల్స్ బ్యాచ్ కు సెలెక్ట్ అయిన మహేష్ భగవత్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 25 సంవత్సరాల పోలీస్ సర్వీస్ తరువాత తనకు అడిషనల్ డిజి ప్రమోషన్ వచ్చిందని, అడిషనల్ డిజి ప్రమోషన్ అనేది తనకు అదనపు భాద్యత అని, తనకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఈ స్థాయికి తీసుకువచ్చిన డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నతాధికారులకు ఎల్లపుడు రుణపడి ఉంటానని ఆయన అన్నారు. రాచకొండ కమిషనరేట్ ఏర్పడినప్పటి నుండి గడిచిన నాలుగు సంవత్సరాల పరిధిలో పోలీసు అధికారులతో ఒక టీమ్ ఏర్పాటు చేసుకుని సమర్థవంతంగా నడిపించానన్నారు. విస్తీర్ణంపరంగా చూసుకుంటే దేశంలోనే  అతిపెద్ద కమిషనరేట్ పరిధి రాచకొండ అని అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో ఎన్నో ఛాలెంజ్స్ ఉన్నాయి!. ఛాలెంజ్ గా తీసుకుని రాచకొండలో లా అండ్ ఆర్డర్ ను కాపాడమన్నారు. కమిషనరేట్ పరిధిలో సిబ్బంది కొరత ఉన్నా మెరుగైన పనీతిరు చూపిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ లో కూడా ప్రజలతో మమేకమై పీపుల్ ఫ్రెండ్లి పోలీస్ రాచకొండ పోలీస్ విత్ యూ ఫార్ యూ అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com