యూఏఈ: సెప్టెంబర్ లో తెరుచుకోనున్న స్కూల్స్..పాటించాల్సిన మార్గదర్శకాలు..
- June 23, 2020
దుబాయ్: యూఏఈ లోని నర్సరీలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను సెప్టెంబర్లో తిరిగి ప్రారంభించే ప్రణాళిక అమల్లో ఉందని విద్యా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనౌద్ అబ్దుల్లా అల్ హజ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
యూఏఈ లో రోజువారీ కరోనా రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే, ఈ నిర్ణయం కఠినమైన ప్రోటోకాల్స్ తో నిండినది అని అనౌద్ అబ్దుల్లా అన్నారు. ప్రతి నర్సరీ/ పాఠశాల/విశ్వవిద్యాలయం పాటించాల్సిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
* ప్రతి ఉదయం విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ఉష్ణోగ్రత తనిఖీలు.
* అన్ని సమయాల్లో 2 మీటర్ల సామాజిక దూరం ఉండేలా చూడాలి. తద్వారా విశ్వవిద్యాలయాలు మరియు పాఠశాలల్లో తరగతి గది సామర్థ్యాన్ని తగ్గించాలి. పాఠశాల బస్సులో గరిష్టంగా 30 మంది విద్యార్థులు కలిగి ఉండాలి.
* క్రమం తప్పకుండా ప్రాంగణం యొక్క క్రిమిరహితం.
* మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిర్దిష్ట మార్గదర్శకాల ప్రకారం కాంటీన్ లు మూసివేయాలి. విద్యార్థులు తమ ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం అనుమతించబడదు.
* ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న పిల్లల కేసులను మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తుంది.
* సమావేశాలు మరియు సమూహ కార్యకలాపాలు అనగా పాఠశాల పర్యటనలు, వేడుకలు, క్రీడలు, క్యాంపులు వంటివి నిలిపివేయడం.
* ఎటువంటి మెయింటనెన్స్ పనులను పని సమయంలో విద్యా సంస్థల్లోకి అనుమతించరు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?