హెచ్1బీ వీసా జారీ...ట్రంప్ కీలక నిర్ణయం
- June 23, 2020
అమెరికా:అమెరికాలో వర్క్ వీసాల రద్దు నిర్ణయంపై భారత టెక్కీల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మినహాయింపుల్లేకుంటే వారంతా వెనక్కి రావాల్సి ఉంటుంది. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు విదేశీ వృత్తి నిపుణులకు జారీ చేసే H-1-B సహా అన్ని వర్క్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయాల్లో గుబులు రేపుతోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన భారతీయ గ్రాడ్యుయేట్లకు సైతం కంటిమీద కునుకులేకుండా పోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ - OPT వర్క్ పర్మిట్‌తో ఉద్యోగం చేస్తున్న దాదాపు 25 వేల మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఈ సారి H-1-B రాకపోతే స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది.
H-1-B సహా అన్ని రకాల వర్క్ వీసాల రద్దుపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని ఈ మధ్యే ట్రంప్ స్పష్టం చేశారు. ఆమేరకు ఉత్వర్వులు వెలువడితే OPTపై పనిచేస్తూ చివరి అవకాశంగా H-1-B వీసా కోసం ఎదురుచూస్తున్న దాదాపు 40 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. వారిలో L-1పై అమెరికా వెళ్లిన 15 వేల మంది ఐటీ నిపుణులు కూడా ఉన్నారు. L-1 గడువు ముగుస్తున్న దశలో ఈ ఏడాది మార్చిలో H-1-Bకి అప్లై చేశారు. వారి దరఖాస్తులు లాటరీ దశలో ఎంపికై పరిశీలన దశలో ఉన్నాయి. ఇప్పుడు హఠాత్తుగా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వారిని చిక్కుల్లో పడేసింది. కొత్తగా వెలువడనున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎలా ఉండబోతుందున్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం H-1-B వీసాపై పనిచేస్తున్న ఐటీ నిపుణుల రెన్యువల్ దరఖాస్తుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువడే దాకా చెప్పలేమంటున్నారు
ఈ ఏడాది మార్చిలో దాదాపు 1.67 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులు H-1-B వీసాలకు దరఖాస్తు చేయగా వారిలో 70 వేల మంది లాటరీలో ఎంపికయ్యారు. వారికి వీసాలు జారీ చేసే ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. సాధారణంగా జూన్ నుంచి లాటరీ ద్వారా ఎంపికైన వారికి H-1-B వీసాలు జారీ చేస్తారు. అయితే ఈ సారి కరోనా కారణంగా అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలు మూతపడ్డాయి. అయినా దాదాపు 8 వేల మందికి H-1-B వీసాలు మంజూరయ్యాయి. మిగిలిన వారి అప్లికేషన్లు పరిశీలిస్తున్న సమయంలో… ట్రంప్ స్వరం మారింది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత వర్క్ వీసాలు రద్దయితే లాటరీలో ఎంపికైన దరఖాస్తులను పరిశీలించే అవకాశం లేదు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







