దుబాయ్ వచ్చే పర్యాటకులను తీసుకొచ్చేందుకు సంసిద్ధమైన ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్
- June 23, 2020
దుబాయ్ : లాక్ డౌన్ తర్వాత మెల్లిమెల్లిగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో ఇక దుబాయ్ విమానయాన సంస్థలు పర్యాటకులను రిసీవ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దుబాయ్ వచ్చే ప్రయాణికులకు జులై 7 నుంచి సేవలను అందించనున్నాయి. ఈ మేరకు దుబాయ్ విమానయాన సంస్థలైన ఫ్లై దుబాయ్, ఎమిరేట్స్ ఎయిర్ వేస్ ప్రయాణికుల భద్రత కోసం తగిన ప్రొటోకాల్ ను సిద్ధం చేసుకుంది. ప్రయాణికులతో పాటు క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బంది రక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వాయుమార్గంలో, ల్యాండింగ్ తర్వాత, నగరంలో ఇలా వివిధ దశల్లో తాము తీసుకుంటున్న చర్యలు వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి ప్రయాణికులకు భద్రత కల్పించేలా ఉంటుందని దుబాయ్ పౌర విమానయాన అధ్యక్షుడు షేక్ అహ్మద్ బిన్ సయిద్ అల్ మక్తూమ్ తెలిపారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల కారణంగా పలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇస్తున్నాయని..దీంతో క్రమంగా తమ సర్వీసులను పెంచుతున్నామని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తెలిపింది. ప్రస్తుతం మరో విమాన సర్వీసులను పెంచుతున్నామని...దీంతో తమ సంస్థకు చెందిన 40 విమానాలు వివిధ నగరాలకు ప్రయాణికులకు చేరవేస్తున్నాయని వివరించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







