హజ్ కు పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి
- June 23, 2020
సౌదీ: ఈ ఏడాది హజ్ కు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అది కూడా ఇప్పటికే కింగ్ డమ్ పరిధిలో ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని కూడా తెలిపింది. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా హజ్ నిర్వహణపై పరిమితులు విధించినట్లు కూడా వెల్లడించింది. పరిమిత సంఖ్యలోనే హజ్ నిర్వహణకు అనుమతి ఇవ్వటం, అది కూడా సౌదీయేతర ముస్లిం దేశాల భక్తులను అనుమతించకపోవటం సౌదీ అరేబియా చరిత్రలోనే ఇదే తొలిసారి. గతేడాది 2.5 మిలియన్ల భక్తులకు హజ్ కు హజరయ్యారు. ఇదిలాఉంటే గల్ఫ్ దేశాల్లోనే అత్యధికంగా సౌదీ అరేబియాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 1,61,000 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,300 మరణాలు సంభవించాయి. అయితే..ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లిరావాలని కోరుకుంటాడు. ఇందుకోసం డబ్బు పొదుపు చేసి మరీ వెళ్తారు. కానీ, సౌదీ ప్రభుత్వం తీసుకున్న సున్నిత నిర్ణయం.. భక్తులను నిరాశకు గురిచేసేలా ఉంది.
హజ్ లో పాల్గొనట్లేదని యూఏఈ ప్రకటన
ముస్లిం తీర్థయాత్రను ఇప్పటికే రాజ్యంలో నివసించే యాత్రికులకు పరిమితం చేయాలని సౌదీ అరేబియా నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది హజ్లో పాల్గొనబోమని యూఏఈ హజ్ వ్యవహారాల కార్యాలయం (హెచ్ఓఓ) సోమవారం ప్రకటించింది. సౌదీ హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖతో సంప్రదించిన తదుపరి HAO ఈ ప్రకటన చేసింది. కరోనా ను అరికట్టేందుకు సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్ చేస్తున్న ప్రయత్నాలను యూఏఈ ప్రశంసించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







